అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా నిలువనున్న శ్రీధర్ వెంబు- ప్రమీలా శ్రీనివాసన్ కేసు ?

السبت، 24 يناير 2026

become the most expensive divorce case? national pay a bond amount of approximately $1.7 billion technology Will the Sridhar Vembu-Prameela Srinivasan case Zoho founder

t f B! P L


జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు - ప్రమీలా శ్రీనివాసన్ విడాకుల కేసు ప్రస్తుతం అమెరికా కోర్టులో నడుస్తోంది. దీనికి సంబంధించిన కేసులో సుమారు 1.7 బిలియన్ డాలర్లు (సుమారు ₹15,000 కోట్లు) బాండ్ మొత్తాన్ని చెల్లించాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు శ్రీధర్ వెంబును ఆదేశించినట్లు సమాచారం. ఈ విడాకుల కేసు ఇదే విధంగా తీర్పు వెలువడితే ఒక భారతీయుడికి సంబంధించిన అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఇది నిలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ఖరీదైన విడాకులలో ఒకటిగా మారుతుంది. ఈ కోర్టు ఉత్తర్వులు గత ఏడాది వెలువడినా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇటీవలే బయటకు వచ్చాయి. అమెరికాలో జోహో సంస్థను విజయవంతంగా నడుపుతున్న శ్రీధర్ వెంబు, గత కొన్నేళ్లుగా తమిళనాడులోని తన స్వగ్రామంలో నివసిస్తున్నారు. ఆయన సరళమైన జీవనశైలి, గ్రామీణాభివృద్ధిపై ఆయనకున్న ఆలోచనలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చల్లో ఉంటాయి. అటువంటి వ్యక్తి విడాకుల కేసు ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నది కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2024 నాటికి శ్రీధర్ వెంబు నికర ఆస్తుల విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లు. ఆయన భారతదేశంలోని 39వ అత్యంత ధనవంతుడు. శ్రీధర్ వెంబు 1993లో ప్రమీలా శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన తన సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలను ఎక్కువగా భారత్ నుండే నిర్వహిస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ