బిగ్‌బాస్ తమిళ్ 9వ సీజన్‌ విజేత దివ్య గణేష్‌

Monday, January 19, 2026

bullitera cash prize of 50 lakh rupees Divya Ganesh wins Bigg Boss Tamil Season 9 She received a trophy tamilnadu won a Maruti Suzuki Victorious vehicle

t f B! P L


బిగ్‌బాస్ తమిళ్ 9వ సీజన్‌లో విజేతగా నిలిచిన దివ్య గణేష్‌ నిలిచారు. ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. అంతేకాకుండా మారుతి సుజుకి విక్టోరియస్ వాహనం కూడా గెలుచుకొన్నారు. ఇంకా పలు బహుమతులు, గిఫ్ట్ హాంపర్స్ ఆమెకు లభించాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి వచ్చిన ఆమె నాలుగో వారం కెప్టెన్‌గా నిలిచింది. అంతేకాకుండా తమిళంలో రెండో మహిళా విన్నర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో అర్చన రవిచంద్రన్ అనే లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలవడం తెలిసిందే. తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభమైంది. కమల్ హాసన్ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన రెండోసారి హోస్ట్‌గా ఈ షోను ముందుకు నడిపించాడు. అయితే తాజా సీజన్‌లో ఆయన పలు వివాదాలను చాకచక్యంగా పరిష్కరించారు. ఓ టాస్క్‌లో ఓ మహిళా కంటెస్టెంట్‌ను ఇద్దరు కంటెస్టెంట్లు శారీరక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై వారిని ఇంటి నుంచి బయటకు పంపించడం సంచలనంగా మారింది. ఇంకా పలు వివాదాలు ఈ సీజన్‌పై ఆసక్తిని రేపేలా చేశాయి. బిగ్‌బాస్ తమిళ సీజన్ 9 లో మొత్తం నలుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులగా నిలిచారు. దివ్య గణేష్, శబరినాథన్, వికాల్స్ విక్రమ్, ఆరోరా సింక్లయిర్ ట్రోఫీ కోసం పోటీపడ్డారు. అయితే చివరకు దివ్య గణేష్‌ను హోస్ట్ విజయ్ సేతుపతి విజేతగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్‌గా శబరినాథన్‌ను ప్రకటించారు. వికాల్స్ విక్రమ్ సెకండ్ రన్నరప్‌గా, ఆరోరా సింక్లయిర్ మూడో రన్నరప్‌గా నిలిచారు. ఫినాలేలో దివ్య గణేష్‌ను విజేతగా ప్రకటించడానికి ముందు హై డ్రామా నడించింది. సూట్ కేసులో కొంత డబ్బు పెట్టి కంటెస్టెంట్లకు ఆశచూపి స్వయంగా ఎలిమినేషన్ ఎవరు అవుతారని గేమ్ ఆడించగా గణ వినోద్ అందుకు మొగ్గు చూపాడు. 18 లక్షల రూపాయల ఉన్న సూట్ కేసును తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దాంతో ఇంటిలో ట్రోఫీ కోసం నలుగురు కంటెస్టెంట్లు పోటీపడ్డారు. అయితే ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఫినాలేలో దివ్య గణేష్ విన్నర్‌గా నిలిచారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ