హైదరాబాద్ లోని బడంగ్‌పేట్‌కు చెందిన వ్యక్తి (43) ఫేస్‌బుక్‌లో కేరళ లాటరీకి చెందిన వీడియోను చూసి అందులో సూచించిన లింక్ ద్వారా ఓ వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఫోన్‌లో మాట్లాడిన అతడు లాటరీలో పాల్గొనేందుకు లింక్ పంపాడు. ఈ లింక్ తెరిచిన బాధితుడికి 'మెగా కేరళ లాటరీ' పేరుతో అప్లికేషన్ కనిపించింది. అనంతరం చిన్న మొత్తాల్లో లాటరీ టికెట్ల కొనుగోలు చేశాడు. వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపేవాడు. లాటరీ టికెట్‌కు డబ్బులు వచ్చాయని చూపుతుండటంతో నమ్మిన బాధితుడు సన్నిహితులు, బంధువుల నుంచి అప్పు తెచ్చి మరీ రెండు నెలల పాటు లాటరీ టికెట్ల కొనుగోలు చేశాడు. ఇలా మొత్తం రూ.7.78 లక్షలు వెచ్చించాడు. లాటరీలో డబ్బు వచ్చినట్లు చూపినా విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడం, బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేరళ ఆన్‌లైన్ లాటరీ పేరుతో రూ.7.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
الثلاثاء، 20 يناير 2026
cyber Criem Cybercriminals have swindled Rs. 7.78 lakhs in the name of a Kerala online lottery hyderabad telangana video about the Kerala lottery on Facebook
ليست هناك تعليقات:
إرسال تعليق