సైబర్ నేరాలు, చోరీలను అరికట్టడానికి తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్‌నకు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా సంచార్ సాథీని డౌన్‌లోడ్ చేసుకున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ఈ యాప్ సాయంతో చట్టవ్యతిరేక, అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 1.52 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేశామన్నారు. మోసపూరిత సిమ్‌లతో ముడిపడివున్న 27 లక్షల వాట్సాప్ ఖాతాలతో పాటు ఇతర డిజిటల్ కమ్యూనికేషన్ ఫ్లాట్‌ఫామ్‌లను కూడా బ్లాక్ చేసినట్టు పేర్కొన్నారు. సైబర్ మోసాలను ఎదుర్కొనే బలమైన ఆయుధంగా సంచార్ సాథీ పనిచేస్తోందన్నారు. గతంలో విదేశీ కాలర్ల నుంచి సుమారు 1.35 కోట్ల నకిలీ కాల్స్ రికార్డు అయ్యేవని.. ప్రస్తుతం అటువంటి కాల్స్ దాదాపు 95 శాతం మేర తగ్గాయని మంత్రి వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడుతుందనే ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పేర్కొన్నారు. అసలు స్నూపింగ్‌కు తావే లేదని, అది సాధ్యం కాదని పేర్కొన్నారు. మరోవైపు, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ జట్లు మొబైల్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు.
2 కోట్ల మందికి పైగా సంచార్ సాథీని డౌన్‌లోడ్ !
الجمعة، 30 يناير 2026
blocked 1.52 crore mobile numbers associated with illegal national Over 2 crore people have downloaded Sanchar Saathi science technology Union Communications Minister Jyotiraditya Scindia
ليست هناك تعليقات:
إرسال تعليق