2027 ఆగస్టు 15 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్‌ సిద్ధం : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

الخميس، 1 يناير 2026

2027 First bullet train to be ready by August 15 Initially services will run from Surat to Bilimora science technology Union Railway Minister Ashwini Vaishnaw

t f B! P L


2027 ఆగస్టు 15న తొలి బుల్లెట్ ట్రైన్‌ సిద్ధంగా ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఓ ప్రకటన చేశారు. "మొదటగా సూరత్ నుంచి బిలిమోరా వరకు సర్వీసులు ఉంటాయి. ఆ తర్వాత వాపీ నుంచి సూరత్ వరకు, అనంతరం వాపీ నుంచి అహ్మదాబాద్ వరకు  సర్వీసులు ఉంటాయని, ఆ తర్వాత థానే నుంచి అహ్మదాబాద్ వరకు సర్వీసులు ఉంటాయి. చివరగా ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సేవలు ప్రారంభమవుతాయి" అని తెలిపారు. బుల్లెట్ ట్రెయిన్ కోసం ఇప్పుడే టికెట్ కొనుగోలు చేయవచ్చు, 2027 నాటికి ఇది సర్వీసులోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ సరదాగా వ్యాఖ్యానించారు. 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభం కానుంది. ఈ మార్గంలో వయాడక్ట్‌లు, వంతెనలు, సొరంగాలు, స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లో గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్‌ నడుస్తుంది. ప్రయాణ సమయం 2 గంటలలోపే ఉంటుంది. అంటే, బుల్లెట్ ట్రైన్‌ ప్రారంభమైన తర్వాత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు 2 గంటలలోపే చేరుకోవచ్చు. భూమిపైన స్తంభాలపై నిర్మించే ఎత్తైన రైలు మార్గం (వయాడక్ట్) పనుల్లో ఇప్పటికే 320 కిలోమీటర్లు పూర్తయ్యాయి. భూసేకరణ, సొరంగ నిర్మాణం, స్టేషన్ నిర్మాణం, విద్యుద్ధీకరణ పనులు ఒకేసారి కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. షింకాన్సెన్ (జపాన్‌కు చెందిన అధిక వేగ రైళ్లకు సంబంధించిన సాంకేతికత) ప్రమాణాలు, భారతీయ ఇంజినీరింగ్‌ను కలిపి ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్తున్నారు. 2027లో తొలి ఆపరేషనల్ రన్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ