ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలటైం టేబుల్ ను ప్రకటించింది. రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు మార్చి 16 2026 ను ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలన్నీ ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ముగుస్తాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 16వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20వ తేదీన ఇంగ్లీషు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23వ తేదీన, సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ మార్చి 25వ తేదీన, బయోలాజికల్ సైన్స్ మార్చి 28వ తేదీన నిర్వహిస్తారు. సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 31వ తేదీన ఉంటుంది. ప్రధాన పరీక్షల తర్వాత మార్చి 31వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో పాటు, ఎస్ఎస్సి , ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలను నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలతో పాటు ఒకేషనల్ కోర్సులు వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం పరీక్ష ముగింపు సమయం 11.30నిమిషాల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు. అకాడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్సి వారికి, ఓ ఎస్ఎస్సి విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని విద్యా శాఖ పేర్కొంది. పరీక్ష సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్న పత్రాన్ని అడిగి తీసుకోవాలని బోర్డు సూచిస్తోంది. పొరపాటున ఎవరైనా తప్పుడు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాస్తే వారి ఫలితాలు రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, తాము ఏ పరీక్ష రాస్తున్నామో ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని తీసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా 2026 లోబడి ఈ పరీక్షా షెడ్యూల్ ఉన్నట్టుగా పేర్కొంది.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పరీక్షలు
الثلاثاء، 20 يناير 2026
All examinations will start at 9:30 AM and end at 12:45 PM Andhra Pradesh School Education Department Tenth Class Examinations from March 16 to April 1
ليست هناك تعليقات:
إرسال تعليق