తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించిన లావాదేవీల్లో మొత్తం రూ. 12.55 కోట్ల మేరకు హవాలా మార్గాల ద్వారా నగదు తరలింపు జరిగినట్లు సిట్ ఆరోపించింది. ఈ కేసులో వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ చావ్డాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. సీబీఐ సిట్ నివేదిక ప్రకారం, నిందితుడు అపూర్వ చావ్డా (A-5) పలు సందర్భాల్లో హవాలా ఆపరేటర్ల ద్వారా మొత్తం రూ. 8.55 కోట్ల నగదును స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదును విజయవాడకు చెందిన హవాలా ఏజెంట్ భారత్ భాయ్ ఠాకూర్ ఆయనకు అందించినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, అదే హవాలా నెట్‌వర్క్ ద్వారా మరో రెండు విడతల్లో అదనంగా రూ. 4 కోట్ల నగదు చావ్డాకు చేరినట్లు సిట్ వెల్లడించింది. ఈ లావాదేవీలతో మొత్తం హవాలా రూ. 12.55 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది. ఈ హవాలా లావాదేవీలు పోమిల్ జైన్ (A-3), విపిన్ జైన్ (A-4) ఆదేశాల మేరకు నిర్వహించబడ్డాయని సిట్ తెలిపింది. వారి సూచనలతో అగర్వాల్ ట్రేడింగ్ కంపెనీ యజమాని ఆశిష్ అగర్వాల్ (A-15) తన హవాలా నెట్‌వర్క్‌ను ఉపయోగించి నగదు తరలింపును సులభతరం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ, చెన్నై, హైదరాబాద్ కేంద్రాలుగా ఉన్న ఏజెంట్ల ద్వారా ఈ నగదు లావాదేవీలు సాగినట్లు సీబీఐ పేర్కొంది. దర్యాప్తు సమయంలో సీబీఐ అధికారులు గుజరాతీ భాషలో ఉన్న చేతిరాత లూజ్ షీట్లు, అలాగే వాట్సాప్ చాట్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఫోన్ నంబర్లు, టోకెన్ కోడ్‌లు, నగదు తరలింపుల వివరాలు ఉండటంతో, హవాలా లావాదేవీలకు ఇవి బలమైన ఆధారాలుగా ఉన్నట్లు సిట్ అభిప్రాయపడింది. ఇదే చార్జ్‌షీట్‌లో మరో తీవ్రమైన అంశాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. ఎం/ఎస్ భోళే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ (A-7) డైరెక్టర్లు, అపూర్వ చావ్డాతో కలిసి కుట్ర పన్ని, తిరుమల లడ్ల తయారీలో ఉపయోగించే నెయ్యి, పాలను కల్తీ చేసి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఆహార భద్రతతో పాటు ప్రజారోగ్యంపై తీవ్రమైన ఆందోళనలకు దారి తీస్తుందని సీబీఐ స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూ కేసు : రా. 12.55 కోట్ల హవాలా మార్గాల ద్వారా తరలింపు
الجمعة، 30 يناير 2026
Andhra Pradesh charge sheet filed by the CBI Rs. 12.55 Crore Transferred Through Hawala Channels Tirumala Laddu Case
ليست هناك تعليقات:
إرسال تعليق