ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు, క్షతగాత్రులను యుద్ధ ప్రాతిపదికన తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఇలాంటి షాకింగ్ ఘటన ఎదురవ్వడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ホーム
/
shocking incident
/
కర్రెగుట్ట కొండలు వద్ద పేలుళ్లు : 11 మంది జవాన్లకు తీవ్ర గాయాలు
الاثنين، 26 يناير 2026
11 jawans seriously injured Bijapur district Chhattisgarh Explosions at Karregutta hills national occurring during the nationwide Republic Day celebrations shocking incident
ليست هناك تعليقات:
إرسال تعليق