ఇండియా కూటమి ప్రస్తుతం వెంటలేటర్ ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను మళ్లీ ఎన్డీయేకు తాము నెట్టేసినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారిందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఒమర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. నితీష్ కూడా అందులో పాల్గొన్నట్టు చెప్పారు. ఆయన పేరును తాము గట్టిగానే ప్రతిపాదించామని, అయితే మరో నేత వీటో పవర్‌తో ఉన్నారని తెలిపారు. ఆర్జేడీతో కొద్దికాలం భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వీప్ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కేవలం 35 సీట్లకే పరిమితమయ్యాయి. దీనిపై ఒమర్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కోలుకుంటోందని అనుకుంటున్న దశలో బీహార్ ఫలితాలతో పరిస్థితి మళ్లీ దిగజారిందన్నారు. బీహార్‌లో జేఎంఎం పార్టీని మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోకపోవడాన్ని నిలదీశారు. రేపు జేఎంఎం కూటిమి జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిని వీడినట్లయితే తప్పెవరిదవుతుందని ఒమర్ ప్రశ్నించారు. 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఒకటిగా పనిచేయాలని, లేనట్లయితే రాష్ట్రాలకే పరిమితమైన నిర్దిష్ట కూటములుగా మిగిలిపోతాయని అన్నారు. ఇండియా కూటమిగా మనం చెప్పుకోవాలనుకుంటే మరింత సమగ్రతను సాధించాల్సి ఉంటుందని సూచించారు.
వెంటలేటర్ పై ఇండియా కూటమి !
السبت، 6 ديسمبر 2025
India Alliance on Ventilator Jammu and Kashmir Chief Minister national NCP leader Omar Abdullah situation of the alliance has deteriorated further after the Bihar elections
ليست هناك تعليقات:
إرسال تعليق