టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నటి ప్రగతి నాలుగు పతకాలు సాధించింది. ప్రగతి ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా లెవల్, తెలంగాణ స్టేట్ లెవల్ పోటీల్లో బంగారు పతకం గెల్చుకుంది. కేరళలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 2023 నుండి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రగతి, గత రెండేళ్లలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారంతో పాటు వెండి పతకాలు గెల్చుకుంది. టర్కీలో జరిగిన పోటీలు అనంతరం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓవరాల్‌గా వెండి పతకం గెల్చుకున్నానని, డెడ్ లిఫ్ట్ విభాగంలో బంగారు పతకం, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించానని గర్వంగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు వీడియోలు, ఫొటోలతో ఉన్న ఓ పోస్ట్‌ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించిన నటి ప్రగతి
السبت، 6 ديسمبر 2025
Actress Pragati wins four medals at Asian Open and Masters Powerlifting Championship Andhra Pradesh national she proudly announced on her social media sports telangana
ليست هناك تعليقات:
إرسال تعليق