స్వయంగా తాను గ్రామసభ నిర్వహిస్తున్నా, సిబ్బంది మాత్రం కనీస అవగాహన లేకుండా వచ్చారు !

الاثنين، 1 ديسمبر 2025

Andhra Pradesh but the staff came without the slightest understanding CM expressed dissatisfaction CM questioned Collector Vetri Selvi He himself is conducting the Gram Sabha

t f B! P L


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నెలలవారీ పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లారు. స్వయంగా తాను గ్రామసభ నిర్వహిస్తున్నానని, సిబ్బంది మాత్రం కనీస అవగాహన లేకుండా వచ్చారని కలెక్టర్ వెట్రీ సెల్వి ని సీఎం ప్రశ్నించారు. ఒక గ్రామంలో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనే కనీస అవగాహన లేకుండా వచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా గ్రామ సభలు పెట్టొద్దన్నారు. గ్రామాల అభివృద్ధి జరిగే విధంగా, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. పెన్షన్ల కోసం మన రాష్ట్రం కంటే ఎవరూ ఎక్కువ ఖర్చుపెట్టడం లేదన్నారు. ఏడాదికి 33వేల కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. రాష్ట్రానికి కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆదాయం లేదని చంద్రబాబు అన్నారు. అయినా ఒకేసారి నాలుగువేలకి పెంచామన్నారు. అప్పటి ప్రభుత్వం ముక్కుతూ,మూలుగుతూ 250 రూపాయల చొప్పున పెంచిందని ఆరోపించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లు మనకు సేవ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం రైతులకు 1650 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు తీర్చడమే కాదు, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి నాలుగు గంటల్లో ఇస్తున్నామన్నారు. 25 కోట్లు మంది మహిళలు ఉచిత బస్ పథకాన్ని వినియోగించుకున్నారన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ