హైదరాబాద్ లోని పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

الخميس، 4 ديسمبر 2025

Criem hyderabad police have arrested two accused in connection with the murder Real estate businessman brutally murdered in Old Basti telangana

t f B! P L


హైదరాబాద్ లోని పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు పాతబస్తీ రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్‌ (30)గా గుర్తించారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారి అయిన జునైద్‌ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచారని, తీవ్రంగా గాయపడిన జువైద్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. అనంతరం జునైద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే నిందితులు, బాధితుడు ఇద్దరూ కూడా బంధువులే అని ఏసీపీ మిర్చోక్ శ్యామ్ సుందర్ తెలిపారు. జువైద్‌ను ఎందుకు హత్య చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ