ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 ప్రపంచకప్ 2026 మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. అయితే 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు కోసం కొత్త జెర్సీని బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జెర్సీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ఆవిష్కరించారు. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే సందర్భంగా 2026 టీ20 ప్రపంచకప్ కోసం జెర్సీని ఆవిష్కరించారు. రోహిత్ శర్మ, తిలక్ వర్మలు చెరో జెర్సీని ఆవిష్కరించారు. ఇప్పుడున్న జెర్సీ కంటే టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధం చేసిన జెర్సీ కాస్త బిన్నంగా ఉంది. జెర్సీపై నిలువుగా లైన్స్ వచ్చాయి. ఆరెంజ్ కలర్ కూడా అదనంగా ఉంది. కొత్త జెర్సీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొత్త జెర్సీని ఆవిష్కరించిన రోహిత్ శర్మ, తిలక్ వర్మ
الخميس، 4 ديسمبر 2025
cricket India and Sri Lanka will jointly host national Rohit Sharma sports T20 World Cup 2026 mega tournament to be held from February 7 to March 8 Tilak Verma unveil new jersey
ليست هناك تعليقات:
إرسال تعليق