ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై రవి బంధువులు స్పందిస్తూ అతడు గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు. మానసిక సమస్యల కారణంగానే ఈ దాడులకు పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రవిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పామిడిలో పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు
الأحد، 14 ديسمبر 2025
Andhra Pradesh Mentally unstable youth attacks police officer with a knife in Pamidi Ravi not only attacked them with a knife but also damaged the police jeep with sticks
ليست هناك تعليقات:
إرسال تعليق