ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ

الجمعة، 26 ديسمبر 2025

2020 after January 1 Andhra Pradesh employees who have been declared medically unfit in the RTC government has issued orders to provide alternative jobs

t f B! P L


ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలిచ్చే విధానం ఉండేది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు, సహా మిగిలిన ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పోరేషన్‌లో ఉండగా 21 కేటగిరీలో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. విలీనం తర్వాత కూడా 21 కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ /శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత బట్టి ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ అన్ ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు చేకూరేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీపీటీడీ కమిషనర్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్‌ఎంయూఎ నేతలతో పాటు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ