దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 3 నాటికే 13 కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డట్టు ఇథియోపియా ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదని, దీని వల్ల మరణాల రేటు 88 శాతం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కి సరైన చికిత్స గాని, మెడిసిన్ గాని కనుగొనబడలేదు. మార్బర్గ్ ఎబోలా కంటే ప్రాణాంతకంగా వ్యాప్తి చెందటమే కాకుండా మరణాల సంఖ్యను కూడా అంచనా వేయలేమని వైద్య పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ కు టీకా గాని, ప్రత్యేక చికిత్స గాని అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్ప, అలసట తదితర వ్యాధి లక్షణాలు రోగుల్లో కనిపిస్తున్నాయని సమాచారం.
ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన
الاثنين، 8 ديسمبر 2025
Deadly Marburg virus in Ethiopia international Marburg virus belongs to the Ebola family mortality rate due to it is 88 percent World Health Organization statement
ليست هناك تعليقات:
إرسال تعليق