కడప కొత్త మేయర్ గా పాక సురేష్ ఎన్నిక


ఆంధ్రప్రదేశ్ లోని కడప నగర నూతన మేయర్ గా పాక సురేష్ ఎన్నికయ్యారు. కడపలోని ఎంపీ నివాసంలో జరిగిన సమావేశంలో వైఎస్ అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ పేరును వైఎస్సాసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్ గా పాక సురేష్ ఎన్నికతోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు కడప మాజీ మేయర్ సురేశ్‌బాబు కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. కడప మేయర్ గా తన పదవీకాలం ఆరు నెలలు ఉండగానే ఎన్నిక నిర్వహిస్తున్నారు అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధం అని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇదే విషయంపై ఈసీ సైతం కౌంటర్ వాదనలు వినిపించింది. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు కడప మాజీ మేయర్ సురేశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో డిసెంబర్ 11(గురువారం) ఉదయం కడప మేయర్ ఎన్నిక జరగనుంది. 

Post a Comment

0 Comments