భారతీయ టెలికం మార్కెట్లో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి. డిసెంబర్ చివరి నాటికి లేదా కొత్త ఏడాది 2026 ప్రారంభం నాటికి ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) తమ రీఛార్జ్ ప్లాన్‌లను 10 శాతం నుంచి 12శాతం పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేనప్పటికీ, పేమెంట్ యాప్‌లలో అలర్ట్స్ రావడం వినియోగదారుల్లో ఆందోళనలను పెంచాయి. డిసెంబర్ 2025 నుంచి భారత్‌లో మొబైల్ రీఛార్జ్‌లు పెరుగుదలకు సంబంధించి 3 టెలికం కంపెనీలలో ఏ ఒక్కటి ఇంకా ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు.
0 Comments