ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణపై విమర్శలకు దిగారు. కోనసీమలో కొబ్బరిచెట్లు వాలిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలు పచ్చని గోదావరి జిల్లాల్ని చూసే ప్రత్యేక రాష్ట్రం అడిగారంటూ తెలిపారు. ఆ విధంగా రాష్ట్ర విభజనలో గోదావరి జిల్లాల పాత్ర ఉందంటూ పవన్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రం విడిపోయినా ఇంత ద్వేషం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్‌లో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పవన్ కళ్యాణ్ కు శ్రీహరి అన్నారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని, తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావంటూ పవన్ పై వ్యాఖ్యలు చేశారు. మైలేజ్ పొందాలంటే పనితనం చూపించు, ఇలా కాదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి పవన్ కు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి !
الثلاثاء، 2 ديسمبر 2025
Andhra Pradesh Minister Vakiti Srihari Pawan criticized Telangana during his visit to Godavari districts Pawan Kalyan's comments should be withdrawn telangana
ليست هناك تعليقات:
إرسال تعليق