ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి నెల సాధారణ జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

الأحد، 7 ديسمبر 2025

Andhra Pradesh AP High Court sentences former AU VC Prasad Reddy to one month in simple imprisonment Nookanna Dora case

t f B! P L


ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డిపై నమోదైన కోర్టు ధిక్కార కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నూకన్న దొర కేసులో కోర్టు ధిక్కారానికి బాధ్యుడిగా తేల్చిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్షతోపాటు, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ప్రసాద్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు నిర్ధారించింది. అయితే ప్రసాద్ రెడ్డి తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును డిసెంబర్ 22వ తేదీ వరకు న్యాయస్థానం సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులనే ధిక్కరించడం కోర్టు పట్ల గౌరవం చూపకుండా మొండిగా వ్యవహరించడం ప్రసాద్ రెడ్డి చేసినట్టు హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇటువంటి వ్యక్తి పైన కనికరం చూపించడం న్యాయవ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. 19 సంవత్సరాల క్రితం 2006 జూలైలో ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని బోటనీ విభాగంలో చేరిన నూకన్న దొర కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 17 ఏళ్ల పాటు సేవలు అందించారు. 2022 నవంబర్ 18వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ రెడ్డి నూకన్న దొరను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా 2022 మే నెల నుంచి ఆయనకు చెల్లించవలసిన జీతభత్యాలను కూడా నిలిపివేశారు. దీనిపైన నూకన్న దొర 2023 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా మార్చి 7న న్యాయమూర్తి ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగించాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వీసి ప్రసాద్ రెడ్డి ఆ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో నూకన్న దొర అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి పైన కోర్టు ధిక్కార కేసును ఫైల్ చేశారు. దీనిపైన హైకోర్టు ధర్మాసనం వాదనలు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ప్రసాద్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను దిక్కరించినట్టు నిర్ధారించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ