ఇన్‌స్టాగ్రామ్ లో హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్ట్ లేదంటే రీల్‌కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్‌ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్‌స్టాలో 30 హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకోవడానికి అవకాశముండేది. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్‌ట్యాగ్‌లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా అదీ నిర్దేశిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణకు బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్‌కు సంబంధించిన బ్యూటీ హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే.. ఆ కంటెంట్‌ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్‌ను పడితే ఆ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం మూడు హ్యాష్‌ట్యాగ్‌లే ఉపయోగించాలని ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్‌ట్యాగ్‌ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.
0 Comments