హైదరాబాద్ లోని పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నం.28లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 2 ఎకరాల్లో నివాసాల నిర్మాణం, నివాసాలున్నాయి. వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన 7 ఎకరాల భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు తెలిపారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమ ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కబ్జాదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టు కోటి రూపాయల ఫైన్ విధించినా కబ్జాదారులు మారలేదు. ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాన్ని హైడ్రా అడ్డుకున్నది. సున్నితమైన ప్రాంతంలో వివాదాలకు చెక్ పెట్టింది. హైడ్రా చర్యలతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
0 Comments