అమరావతిలో లే అవుట్ రోడ్‌లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని, అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండేళ్లలో డ్రైనేజ్‌లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. అవసరమైన ప్రాజెక్టుల కు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామన్నారు. లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లు ఉన్న 11, 8 జోన్ల లో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. 66వేల ఫ్లాట్స్‌లో 7వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్‌లు చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్‌ను రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటు న్నారని చెప్పారు. 450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1891 ఫ్లాట్స్‌లో కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నవి ఉన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరత్రా రిజిస్ట్రేషన్‌లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామన్నారు. రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి కోరారు. 11, 8 జోన్‌లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నామని, ఫేజ్ వైజ్ కాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
లే అవుట్ రోడ్‌లు అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం !
الثلاثاء، 9 ديسمبر 2025
Andhra Pradesh drainage Layout roads will be completed on time Minister Narayana roads and other infrastructure works will be completed in two years
ليست هناك تعليقات:
إرسال تعليق