ప్రమాదవశాత్తు విమానం రెక్కకు వేలాడిన స్కైడైవర్ !

Friday, December 12, 2025

Australia international Skydiver accidentally hangs from plane wing skydiving in South of Cairns The incident took place last month

t f B! P L


ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో స్కైడైవింగ్ కోసం విమానంలో పైకి వెళ్లిన ఓ వ్యక్తి కొద్దిసేపు గాల్లోనే వేలాడాడు. స్కైడైవింగ్ చేస్తుండగా ఆయన పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కొంతమంది ఔత్సాహిక స్కైడైవర్లు ఓ విమానంలో ఆకాశంలోకి వెళ్లి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో నుంచి కిందకి దూకుతున్నారు. ఈ క్రమంలో ఓ స్కైడైవర్ తొందరపడి పారాచూట్ బటన్ ను ముందే నొక్కాడు. దీంతో అతను విమానం అంచున ఉండగానే పారాచూట్ విచ్చుకుంది. గాలి వేగానికి అది విమానం తోకను చుట్టేసుకుంది. ఇంతలోనే ఆ స్కైడైవర్ విమానంలో నుంచి దూకేశాడు.పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఆ స్కైడైవర్ గాల్లో వేలాడాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైనప్పటికీ వెంటనే సమయస్ఫూర్తితో తన వద్ద ఉన్న కత్తితో పారాచూట్ తాళ్లను కోసి విమానం నుంచి విడివడ్డాడు. స్కైడైవర్ల పారాచూట్ లలో అదనంగా ఉండే రిజర్వ్ పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పారాచూట్ కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ