రెజ్లర్ వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ఎక్స్‌లో పేర్కొంది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు వెళ్లకుండా అనర్హులిగా ప్రకటించారు. అంతేకాకుండా రన్నరప్ పతకం కూడా ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెంది రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి హర్యానా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక జులైలో ఒక మగబిడ్డకు కూడా జన్మినిచ్చింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని.. 2028లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. దాదాపు 18 నెలల విరామం తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. పునరాగమనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లాస్ ఏంజిల్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
0 Comments