ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై త్రీ మెన్ కమిటీ ఈరోజు సమీక్ష నిర్వహించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక అంశాలను వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింకు డాక్యుమెంట్ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయని వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించాయని ప్రకటించారు. కాగా, జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని, జరీబు భూములపై జెన్యూన్‌గా ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కమిటీ రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పది సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని, వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములు ఇచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నారని, కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని వివరించారు. వీధి పోటు భూములకు సంబంధించి సుమారు 150 ఉన్నాయని, వీధి పోటుకు సంబంధించి మరో రెండు అంశాలు రైతుల కోరుతున్నారని ఆ అంశాలను తర్వాత పరిగణిస్తామని స్పష్టం చేశారు. త్రీ మెన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356కు గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమస్యలపై కూడా ఈ రివ్యూలో చర్చించినట్లు తెలిపారు. లార్జ్ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పరిష్కారం దిశగా వర్క్ చేస్తున్నామన్నారు. ఎవరెవరికి పెన్షన్లు మిస్ అయ్యాయో వాటి వివరాలు సేకరిస్తున్నా మని చెప్పారు. అలాగే కొత్తగా పెళ్లయిన వారికి కూడా పెన్షన్లు అందజేయాలని చూస్తున్నామని చెప్పారు. భూమి ఇచ్చిన వారికి బిలో పావర్టీ లైన్ తో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అమరావతి రైతులకు లింకు డాక్యుమెంట్ లేకుండా రుణాలు, అందరికీ హెల్త్ కార్డులు !
السبت، 27 ديسمبر 2025
and health cards for all Andhra Pradesh Loans without link documents for Amaravati farmers three-member committee today reviewed Union Minister Pemmasani Chandrasekhar
ليست هناك تعليقات:
إرسال تعليق