ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, సోమందేపల్లిలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న పర్యటించారు. సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం హిందూపురం చేరుకున్న మంత్రి, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి యశ్వంత్‌పూర్ - హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురంలో స్టాపింగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సోమన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. అలాగే 717 ఆర్జీవీలు, ఆర్‌యూవీల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటిలో తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హిందూపురం, ప్రశాంతి నిలయం స్టేషన్లు కూడా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం ఏపీలో ఎనిమిది వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా హిందూపురంలో తాలూకా స్థాయిలో వందేభారత్‌కు స్టాపింగ్ కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది హిందూపురం ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోమన్న
الأحد، 28 ديسمبر 2025
Andhra Pradesh inaugurated a railway station developed at a cost of Rs. 4 crore Somanna Union Minister of State for Railways with State BC Welfare Minister S. Savitha
ليست هناك تعليقات:
إرسال تعليق