వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ !


భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటిస్తూ, రెపో రేటును 5.25% కు తగ్గించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సంవత్సరం ఆర్బీఐ వరుసగా నాలుగోసారి రేట్లను తగ్గించడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు, జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, తాజాగా మరో 25 బేసిస్ పాయింట్ల కోత వల్ల మొత్తం 2025లో రెపో రేటు 1.25% తగ్గింది. దీనిని నిపుణులు 'వడ్డీ రేట్లపై ట్రిపుల్ బోనస్' గా పేర్కొంటున్నారు. గృహ రుణాల ఇఎంఐలు తగ్గే అవకాశం ఉంది. కొత్తగా రుణం తీసుకునేవారికి కూడా ఇది అనుకూలం. వాహనం మరియు వ్యక్తిగత రుణాల వడ్డీలు తగ్గితే ఖరీదైన వస్తువుల కొనుగోలుకు వినియోగదారులు ముందుకు రావచ్చు. తక్కువ వడ్డీ రేట్లు వ్యాపారాలను కొత్త పెట్టుబడుల కోసం ప్రోత్సహిస్తాయి. మార్కెట్‌లో డబ్బు సరఫరా పెరిగి జీడీపీ వృద్ధికి తోడ్పడుతుంది.


Post a Comment

0 Comments