Ad Code

తిరుమల వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు


తిరుమల వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు పెట్టాలని టీటీడీ చేసిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికే పలు ప్రముఖ గెస్ట్ హౌస్ ల పేర్లను మార్పు చేసారు. తాజాగా తిరుమల వీధుల పేర్లను ఖరారు చేసారు. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆన్ లైన్ టికెట్లను జారీ చేయనున్నారు. తిరుమల క్షేత్రంలోని వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తిరుమలలో కొన్ని వీధుల కు మేదరమిట్ట, ఆర్‌బీ సెంటర్, ముళ్లగుంత వంటి పేర్లు కొన్ని వీధులకు ఉన్నాయి. తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పేర్లు ఉండటంపై చర్చ జరిగింది. దీంతో శ్రీవారి పరమ భక్తుల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల శ్రీ అన్నమాచార్యులు, శ్రీ తిరుమల నంబి రోడ్డు, శ్రీ వెంగమాంబ రోడ్డు, శ్రీ పురందరదాసు, శ్రీ అనంతాళ్వార్ రోడ్డు, శ్రీ సామవై రోడ్డు వంటి వంటి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. వీటి పైన టీటీడీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీ స్వాధీనం చేసిన విశ్రాంతి భవనాల్లో 42 భవనా లకు దాతల సొంత పేర్లు ఉండగా వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంభందించి 75 పేర్లను సూచించి, వాటిలో ఎదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరు గా పెట్టుకోవాలని బోర్డు అదేశించింది. ఇందులో భాగంగానే 42 గెస్ట్ హౌస్ లకు పేర్లు మారాయి. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన కు గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండా లని నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu