భారత్‌లో 2030 నాటికి అమెజాన్‌ 35 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు : అదనంగా 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు

الأربعاء، 10 ديسمبر 2025

Amazon is hosting Sambhavan 2025 Amazon to invest $35 billion in India by 2030 Create 1 million direct and indirect jobs science technology

t f B! P L


న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అమెజాన్‌ సంభవన్‌ 2025 నిర్వహిస్తోంది. ఇందులోనే భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది. 2030 నాటికి 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సీనియర్ అధికారి అమిత్ అగర్వాల్ ప్రకటించారు. ఏఐ, ఉద్యోగాల కల్పన, వ్యాపార విస్తరణపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు కంపెనీ విస్తరణకే కాదు భారతదేశ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడతాయని అన్నారు. కాగా, 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. దీనికి అదనంగా వచ్చే ఐదేళ్లలో అంటే 2030 నాటికి మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా 2030 నాటికి భారత్‌లో అమెజాన్‌ అదనంగా 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని యోచిస్తోంది. కేవలం ప్యాకేజింగ్, లాజిస్టిక్ విభాగాల్లోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలను కల్పించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ