చైనాలో షియోమీ 17 అల్ట్రా విడుదల !

الخميس، 25 ديسمبر 2025

key upgrades compared to the older model in terms of battery performance processor science technology Xiaomi 17 Ultra launched in China

t f B! P L


చైనాలో షియోమీ  ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో నాలుగో మోడల్‌గా షియోమీ 17 అల్ట్రాను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన షియోమీ  15 అల్ట్రాకు కొనసాగింపుగా ఈ మొబైల్ ను తీసుకువచ్చింది. బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు, కెమెరాల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్ అందిస్తోంది. ఈ కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm ప్రాసెస్ పై తయారైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్. కెమెరా విభాగంలో లైకా ట్యూన్ చేసిన రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. షియోమీ 17 Ultra బేస్ వేరియంట్‌లో 12GB RAM + 512GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర CNY 6,999గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 90,000 గా ఉంటుంది. ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,499 (రూ. 96,000) కాగా.. టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 8,499 (రూ. 1,09,000) గా నిర్ణయించారు. ఈ డివైస్‌లో భారీ సామర్థ్యం గల 6800mAh Jinshajiang బ్యాటరీను అందించారు. 90W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 27 నుంచి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్, వైట్, పింక్, స్టారీ స్కై గ్రీన్ అనే నాలుగు రంగుల్లో లభించనుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ