ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు. అయితే, ఈ మరణాలు స్క్రబ్ టైఫస్ వల్లే సంభవించాయో లేదో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉందని, దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ కేసులే నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణలో 309 కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం కొమెరపూడి గ్రామానికి చెందిన బత్తుల లూర్దమ్మ (64) జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించడంతో ఇక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్ లో 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదు
الثلاثاء، 9 ديسمبر 2025
1566 scrub typhus positive cases registered Andhra Pradesh Health Commissioner Veerapandian Nine people have died due to the symptoms of this disease
ليست هناك تعليقات:
إرسال تعليق