ఆంధ్రప్రదేశ్ సీఐడీ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ముఠా కేసులో పురోగతి సాధించింది. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి 1400 సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ ఛేదించింది. అయితే, వియత్నాం దేశానికి చెందిన హో హుడే యువకుడిని వెస్ట్ బెంగాల్ లో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి వైజాగ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కేంద్రంగా సైబర్ క్రైమ్ నేరాలకు నేరగాళ్లు సిమ్ బాక్స్ లు ఆపరేట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించిన ఏపీ సీఐడీ : 1400 సిమ్ కార్డ్స్ స్వాధీనం
الخميس، 25 ديسمبر 2025
1400 SIM cards seized Andhra Pradesh AP CID busts international cybercrime network identified those involved in cybercrimes operating from Cambodia
ليست هناك تعليقات:
إرسال تعليق