తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించింది. దీని విలువ 1.20 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడును కలిసి ఈ బ్లేడ్లను అందజేశారు. ఈ హాఫ్ బ్లేడ్లు ఏడాదికి సరిపడేలా తిరుమల కల్యాణకట్ట అవసరాలను తీరుస్తాయి. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించడానికి బ్లేడ్ల కోసం ఏడాదికి 1.16 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని అన్నారు. రోజుకు 40,000 హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామని చెప్పారు. ఏడాదికి టీటీడీ అవసరాలకు సరిపడేలా బ్లేడ్లను విరాళం ఇవ్వడానికి దాత ముందుకు రావడం గొప్ప విషయమని అభినందించారు. అనంతరం వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.
0 Comments