Ad Code

బుర్ఖా ధరించలేదని భార్య, బిడ్డలను చంపిన ఘనుడు !


త్తరప్రదేశ్‌ లోని షామ్లీ జిల్లాలో బుర్ఖా ధరించలేదని ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఆపై వారి మృతదేహాలను ఇంట్లోనే బొందతీసి పాతిపెట్టాడు. ఈ హత్యలు జరిగి వారం రోజులు కాగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షామ్లీ జిల్లాకు చెందిన ఫరూక్‌, తాహిరా (35) ఇద్దరూ భార్యాభర్తలు. వారికి షరీన్‌ (14), అఫ్రీన్‌ (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారం రోజుల క్రితం డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో తాహిరా తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తన భార్య బుర్ఖా ధరించకుండా పుట్టింటికి వెళ్లడం ద్వారా తన పరువు తీసిందని ఫరూఖ్‌ ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో భార్య తాహిరాను, కుమార్తెలు షరీన్‌, అఫ్రీన్‌లను తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఆపై ఇంట్లోనే బొందతీసి ముగ్గురినీ ఆ బొందలో పాతిపెట్టాడు. వారం రోజులైనా తాహిరా ఆమె పిల్లలు కనిపించకపోవడంతో స్థానికులు విషయాన్ని గ్రామపెద్ద దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాహిరా పుట్టింటి వారిని ఆరా తీయగా తమవద్దకు రాలేదని చెప్పారు. దాంతో ఫరూఖ్‌ను తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. భార్యాబిడ్డలను తానే హత్యచేసి ఇంట్లోనే పాతిపెట్టానని చెప్పాడు. తన భార్య బుర్ఖా ధరించకుండా బయటికి వెళ్లి తన పరువు తీసిందని, అందుకే చంపేశానని చెప్పాడు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశాడు. పాతిపెట్టిన తల్లీకూతుళ్ల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. నిందితుడు హత్యలకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu