విజయవాడ సింగపూర్ ప్రత్యక్ష విమాన సర్వీసులు - సింగపూర్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

السبت، 15 نوفمبر 2025

Andhra Pradesh flight services were stopped during the YSRCP regime due to lack of passengers In the past MoU with Singapore Government Vijayawada Singapore Direct Flight Services

t f B! P L


సింగపూర్ - విజయవాడ అంతర్జాతీయ విమాన సర్వీసు పునః ప్రారంభం అవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేసింది. నిన్న జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో సింగపూర్ హోం, న్యాయశాఖ మంత్రి కె. షణ్ముగం, సింగపూర్ విదేశాంగ మంత్రి గన్ సియో హువాంగ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి ఏపీ మరియు సింగపూర్ ల మధ్య విమాన ఒప్పందం పైన సంతకం చేశారు. దీనిని సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విమాన సర్వీసు వల్ల తెలుగు ప్రజలకు సింగపూర్ తో మంచి సంబంధాలు ఏర్పడతాయని, టూరిజం అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి వంద రోజుల్లోనే విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతంలో తగినంత మంది ప్రయాణికులు లేరని వైసిపి హయాంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత సర్వీసులు ఇండిగో సంస్థ ప్రారంభించింది. వయబులిటీ ఫండింగ్‌ లేకుండా వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడపనున్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ