తిరుపతికి చెందిన మాలే శంకరయ్య టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో మజ్దూరుగా పనిచేసేవాడు. రూ.46 వేలు తీసుకుని దర్శనం చేయించకుండా తనను మోసగించాడంటూ 2023లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శంకరయ్య అప్పటి నుంచి ఉద్యోగానికి హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయినా అతని తీరు మారలేదు. తాజాగా విజయవాడకు చెందిన భక్తుల నుంచి రూ.1.20 లక్షలు తీసుకుని మోసగించాడు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు నిఘా పెట్టడంతో దొరికిపోయాడు. శంకరయ్య నుంచి సెల్‌ఫోన్, రెండు బ్యాంక్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో తిరుమలలోని కొంతమంది పీఆర్వోలు, దళారీలతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నాడని తేలింది. గడిచిన రెండు మూడేళ్లలో దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. శంకరయ్యకు టీటీడీ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పీఆర్వోలు, పీఏలు ఎవరెవరు సహకరించారో ఆరా తీస్తున్నారు.
దర్శనాల పేరిట భక్తులను మోసగిస్తున్న టీటీడీ ఉద్యోగి అరెస్ట్
الأربعاء، 12 نوفمبر 2025
Andhra Pradesh It was found that cash transactions of about Rs. 40 lakh to Rs. 50 lakh had taken place in the last two to three years TTD employee arrested for cheating devotees in the name of darshan
ليست هناك تعليقات:
إرسال تعليق