హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు కలకలం రేపాయి. దీనిపై పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ, రెండున్నర కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, రెండు స్కూటీలు, 5వేల 500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డవారిని వేమేష్, దేవిచరణ్, హేమంత్‌గా గుర్తించారు. పార్క్ కి హై ప్రొఫైల్ ఉన్నవాళ్లు అక్కడ వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అలాంటి ప్లేసులో భయం లేకుండా డ్రగ్స్ అమ్మేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. అది వాళ్ల స్పాటా..? లేదా ఎవరికైనా డ్రగ్స్ ఇచ్చేందుకు అక్కడికి వచ్చారా..? వారి డ్రగ్ లింక్స్ ఎక్కడివి అనే అంశాలపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డ్రగ్స్ విషయంలో.. ఉపేక్షించే పరిస్థితులు ఉండవని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు ఇవ్వాలని.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు.
కేబీఆర్ పార్క్ దగ్గర గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు : ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
الجمعة، 14 نوفمبر 2025
Criem Excise department officials arrest three accused hyderabad Sale of marijuana and drugs near KBR Park telangana
ليست هناك تعليقات:
إرسال تعليق