తెలంగాణలోని మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసుకు సంబంధించి రూ. 20వేలు లంచం తీసుకుంటుం డగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్ లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దీంతో ఎస్‌ఐ రాజేష్‌ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చారు.
తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ
الثلاثاء، 18 نوفمبر 2025
SI caught taking bribe SI escapes by jumping over police station wall while being questioned by ACB officials Tekmal police station in Medak district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق