తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత : వాహనదారులకు తీవ్ర హెచ్చరిక !

الثلاثاء، 18 نوفمبر 2025

Andhra Pradesh Increasing cold intensity in Telugu states Meteorological Department is issuing warnings Severe warning to motorists telangana

t f B! P L


తెలుగు రాష్ట్రాలలో ముందు ముందు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించిన వాతావరణశాఖ రెండు తెలుగు రాష్ట్రాలలోను రాత్రివేళ, తెల్లవారుజామున పొగమంచు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించడం కష్టమవుతుందని, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోగలరని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ.. వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని సూచించారు. తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని సూచించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ