'తెలుగు టెక్ ట్యూట్స్' యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్ సయీద్ హఫీజ్ కు యూఏఈ గోల్డెన్ వీసా మంజూరు !

الأحد، 2 نوفمبر 2025

'Telugu Tech Tuts' YouTube channel founder Saeed Hafeez granted UAE Golden Visa opportunity to live in the United Arab Emirates along with his family members for ten years telangana

t f B! P L


'తెలుగు టెక్ ట్యూట్స్' యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్ సయీద్ హఫీజ్ కు అరుదైన గౌరవం దక్కింది. డిజిటల్ కంటెంట్ క్రియేషన్, టెక్నాలజీ ఎడ్యూకేషన్ లో ఆయన సేవలను గుర్తించిన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను అందించింది. ఈ వీసా ద్వారా సయీద్ హఫీజ్ పదేళ్ల పాటు తన కుటుంబ సభ్యులతో సహా  యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జీవించే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని యైతింక్ లైన్ కాలనీకు చెందిన హఫీజ్ తన నైపుణ్యం, క్రమశిక్షణ కారణంగా ప్రపంచ గుర్తింపు సాధించిన క్రమంలో పలువురు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. ఈ గోల్డెన్ వీసాలో భాగంగా హఫీజ్, అతని కుటుంబం పదేళ్ల పాటు యూఏఈలో నివసించడం, విద్యను అభ్యసించడం, ఉపాధిని పొందడం తదితర బెనిఫిట్స్ ను అనుభవించవచ్చు. ఇదే విషయంపై హఫీజ్ మాట్లాడుతూ ఇది నాకు గర్వకారణం. నాకు మాత్రమే కాదు టెక్నాలజీ సామర్థ్యాన్ని ఎవరైతే నమ్ముతారో.. సృజనాత్మకతను ఎవరైతే నమ్ముతారో వారికి గర్వకారణం. యూఏఈ గోల్డెన్ వీసా.. అంతర్జాతీయంగా నా పనిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు తోడ్పడుతుంది. ఈ మేరకు హఫీజ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో సదాశివ ఫౌండేషన్ అతడ్ని ఘనంగా సత్కరించింది. కృషి, పట్టుదల ఉంటే ప్రజల జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయో హఫీజ్ నిరూపించారని ఫౌండేషన్ సభ్యులు కొనియాడారు. హఫీజ్ 2011లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తెలుగు టెక్ ట్యూట్స్ పేరు పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఛానల్ కు 1.79 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 4 వేలకు పైగా వీడియోలు అప్లోడ్ చేశాడు. యూట్యూబ్ ద్వారా ఆయనకు నెలకు దాదాపు రూ. 2 లక్షలు ఆదాయం వస్తుంది. 2022 లో ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ లిస్టులోనూ ఆయన 32 వ స్థానంలో నిలిచాడు. 2017 లో అప్పటి ఏపీ ప్రభుత్వం అతనికి బెస్ట్ కంటెంట్ అవార్డును అందించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ