వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్లను కంగుతినిపించిన క్రికెటర్ శ్రీచరణికి ఘన సన్మానం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడకు రానున్న చరణిని గన్నవరం నుంచి భారీ ర్యాలీతో ఆహ్వానించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చరణిని సత్కరించనున్నారు. అదే సమయంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ఆటగాళ్లకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో, చరణికీ అదే రీతిలో బంపర్ ఆఫర్ లభించే అవకాశం ఉందని సమాచారం. కడప జిల్లాలోని చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చరణి విజయగాధ ఇప్పుడు యువతకు ఆదర్శంగా నిలిచారు.
క్రికెటర్ శ్రీ చరణికి ఘన సన్మానం చేయడానికి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
الأربعاء، 5 نوفمبر 2025
Andhra Cricket Association is making arrangements Andhra Pradesh government ready to pay tribute to cricketer Sri Charani cricket sports
ليست هناك تعليقات:
إرسال تعليق