థాయ్‌లాండ్‌లో ప్రభుత్వం పగటిపూట మద్యం తాగాడాన్ని నియంత్రించేందుకు కొత్త చట్టాలను అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, నియమాలను ఉల్లంఘించిన వారికి రూ.27,500 (10,000 బాత్) వరకు జరిమానాను అధికారులు విధించనున్నారు. ఉదయం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం సేవించడం, విక్రయించడం నిషేదం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి థాయ్‌లాండ్ కరెన్సీలో 10,000 బాత్ (రూ.27,500కు పైగా) జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించడం ద్వారా సామాజిక సమస్యలు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. థాయ్‌లాండ్ ప్రభుత్వ నిర్ణయంపై పర్యాటకులు పెదవి విరిస్తున్నారు. పర్యాటక రంగంలో మద్యం వినియోగం సాధారణంగా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త చట్టాలు పర్యాటకులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. అక్కడి ప్రభుత్వం సైతం పర్యాటకులు ఈ నిబంధనలను పాటించాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు, మునిసిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెస్టారెంట్లు, బార్లు, పబ్స్ వంటి ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. సీసీటీవీ ఆధారంగా మద్యం సేవనాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటారు.
పగటిపూట మద్యం తాగాడాన్ని నిషేధించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం
الأحد، 9 نوفمبر 2025
000 baht alcohol is prohibited between 2 am and 5 pm international Thailand bans daytime drinking who violate the rules will be fined up to 10
ليست هناك تعليقات:
إرسال تعليق