ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్ధసారధి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ, టూరిజం పాలసీ, ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానాలకు ఆమోదం తెలిపింది. అలాగే లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్వాంటమ్ మిషన్ తో అనుసంధానం చేస్తూ రాష్ట్ర క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రతీ మండలంలో నైబర్ హుడ్ వర్క్ స్పేస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రతీ చోటా 20-30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. తాజాగా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన లక్ష కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ホーム
/
tourism policy
/
ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన కేబినెట్
الاثنين، 10 نوفمبر 2025
and AP quantum computing policies were approved Andhra Pradesh Cabinet approves investments of Rs 1 lakh crore approved in SIPB meeting electronic policy Food processing tourism policy
ليست هناك تعليقات:
إرسال تعليق