ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలకిందటే గోపీనాథ్ కొడుకుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని, గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ కన్ను వేశాడని ఆరోపించారు. ఆయన ఆస్తుల డాక్యుమెంట్లను తారుమారు చేశారని విమర్శించారు. ఆయన వారసుల పత్రాలనే ఫోర్జరీ చేయగలిగితే, ఇక సాధారణ ప్రజల డాక్యుమెంట్లకు రక్షణ ఎలా ఉంటుందని బండి సంజయ్ ప్రశ్నించారు. అమెరికాలో ఉంటోన్న గోపీనాథ్ కుమారుడిని తెలంగాణకు రావొద్దని, వస్తే చంపేస్తామని ఓ మాజీ మంత్రి సైతం ఫోన్ చేసి బెదిరించారని విమర్శించారు. మాగంటి సునీతకు రెండు ఓటరు ఐడీలు ఉన్నాయని, 2023, 2025లో సమర్పించిన అఫిడవిట్లలో ఆమె విద్యా అర్హతలు వేర్వేరుగా ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇది ఇలా వుండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ ఫిర్యాదు అందింది. తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సంరక్షణ బాధ్యత వహించిన వ్యక్తుల నిర్లక్ష్యం, మితిమీరిన జోక్యం చోటు చేసుకుందని మహానంద కుమారి ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. మూత్రపిండాల సమస్యలకు చికిత్స కోసం ఈ ఏడాది జూన్ 5న ఆసుపత్రిలో చేరగా, జూన్ 8న ఆయన మరణించినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గోపీనాథ్ ఐసీయూలో ఉన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనను చూడటానికి అనుమతించలేదని తల్లి మహానంద కుమారి ఆరోపించారు.
మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ కన్ను వేశాడు : బండి సంజయ్
الأحد، 9 نوفمبر 2025
criticized him for tampering with property documents KTR has set his sights on Maganti Gopinath's assets telangana Union Minister Bandi Sanjay
ليست هناك تعليقات:
إرسال تعليق