బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన తీర్పును తాము గమనించామని, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని భారత్ స్పష్టం చేసింది. ''మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ వెలువరించిన తీర్పును ఇండియా గుర్తించింది. పొరుగు దేశమైనా బంగ్లాదేశ్ లో శాంతి, ప్రజాస్వామ్యం, సమ్మిళితత్వం, స్థిరత్వంతో పాటు ఆ దేశ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంతో మేము ఎల్లప్పుడూ అన్ని వాటాదారులతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం'' అని ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఢాకా అల్లర్ల కేసులో ఐసీటీ హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా భారతదేశాన్ని కోరింది. నిందితుల అప్పగింతకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తు చేసింది. ఢాకా అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ విడిచిపారిపోయిన షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం : స్పష్టం చేసిన భారత్
الثلاثاء، 18 نوفمبر 2025
democracy inclusiveness and stability in Bangladesh India clarified India is committed to peace international national Will act constructively to protect the interests of the people of Bangladesh
ليست هناك تعليقات:
إرسال تعليق