బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా దగ్గుబాటి హీరో రానా విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఐడీ పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు హీరో రానాను గంటన్నర పాటు ప్రశ్నించారు. ఈ విచారణకు రానా తన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌తో రానా చేసుకున్న అగ్రిమెంట్‌పై సీఐడీ విచారించింది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో రానాకు వచ్చిన పారితోషికంపై కూడా సీఐడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, ఇప్పటికే ఈ కేసులో సీఐడీకి కూడా స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. రానా 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. తాను ఈ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడానికి ముందు తన లీగల టీమ్‌తో అన్నీ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు గతంలో రానా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదని రానా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం యాంకర్ విష్ణుప్రియను కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా ప్రకాష్‌రాజ్, హీరో విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు సీఐడీ విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ కేసు : సీఐడీ విచారణకు హాజరైన హీరో రానా, యాంకర్ విష్ణుప్రియ
السبت، 15 نوفمبر 2025
anchor Vishnupriya appear before CID and Siri Hanumanthu have already appeared before the CID for questioning Andhra Pradesh Betting apps case Hero Rana hero Vijay Deverakonda Prakash Raj telangana
ليست هناك تعليقات:
إرسال تعليق