మరో నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ

الاثنين، 3 نوفمبر 2025

Bengaluru to Kochi Ferozepur Kant to Delhi Lucknow to Saharanpur national Railway Ministry issues notification to start four more Vande Bharat trains Varanasi to Khajuraho

t f B! P L


రైల్వే మంత్రిత్వ శాఖ మరో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్ణాటకలోని బెంగళూరు నుంచి కేరళలోని కొచ్చి (ఎర్నాకుళం జంక్షన్), పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంట్ నుంచి ఢిల్లీ వరకు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి సహారన్‌పూర్ వరకు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వందే భారత్ రైళ్లు పలు రాష్ట్రాలను అనుసంధానం చేస్తాయని పేర్కొంది. కర్ణాటక, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను కలుపుతూ ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు. రైల్వే బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం బెంగళూరు-కొచ్చి వందే భారత్ రైలు షెడ్యూల్ విడుదల చేసింది. రైలు నంబర్ 26651 గల కేఎస్‌ఆర్ బెంగళూరు-ఎర్నాకుళం జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరనున్నట్లు తెలిపింది. ఆ రైలు.. మధ్యాహ్నం 1.50 గంటలకు ఎర్నాకుళం జంక్షన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.20 గంటలకు ఎర్నాకుళంలో ప్రారంభం కానుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలు కృష్ణరాజపురం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ