హైదరాబాద్ సమీపంలోని చిట్యాల వద్ద రూ.120 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ప్రముఖ స్ట్రక్చరల్ స్టీల్ సంస్థ ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తమ రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తినిస్తుంది. దీంతోకంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రెండు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్టన్నులకు పెరగనుంది. ఈ ఫాబెక్స్ సంస్థ ప్రీ-ఇంజినీర్డ్ నిర్మాణాలు, ఉక్కుఅమరికల రూపకల్పన, డిటైలింగ్, తయారీ, ఇన్‌స్టాలేషన్ వంటి విభాగాల్లో పని చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం విజయవాడలోని యూనిట్ ద్వారా దేశీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే ఉత్పత్తుల ఎగుమతులు సైతం చేస్తోంది. ప్రస్తుతం రూ.463 కోట్ల టర్నోవర్ కలిగిన ఫాబెక్స్, 400 మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్యకలాపాల విస్తరణతో, ఈ సంఖ్యను 800 మందికి పెంచాలని యోచిస్తోంది. తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాబోయే రెండుమూడేళ్లల్లో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వేణు చావా తెలిపారు.
ホーム
/
technology
/
తెలంగాణలో ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ రెండవ తయారీ కేంద్రం ఏర్పాటు !
الاثنين، 3 نوفمبر 2025
40 acres at Chittal near Hyderabad with an investment of Rs. 120 crore business Fabex Steel Structures to set up second manufacturing facility in Telangana technology
ليست هناك تعليقات:
إرسال تعليق