బీహార్​ ఎన్నికల్లో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో దుమ్ములేపుతున్న జనశక్తి పార్టీ

الجمعة، 14 نوفمبر 2025

Chirag Paswan Janshakti Party is making a splash in Bihar elections with a strike rate of over 75 percent national one seat in the last election

t f B! P L


బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కూడా ఎన్నికల ఫలితాల్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తుంటే, యువ పార్టీ ఎల్జేపీ సైతం చిరాగ్ పాశ్వాన్ సారధ్యంలో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విక్టరీ కొట్టింది. గత ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ పార్టీ ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలో బీహార్ రాజకీయాల్లో పార్టీ మరింత శక్తివంతంగా మారింది. 2020 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఎల్జేపీ, ఈ ఎన్నికల్లో దాదాపు 75 శాతం స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాల్లో ఎల్ జేపీ పోటీ చేస్తే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గతంలోనూ ఎల్జేపీ పార్టీ పోటీ చేసిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ తో విబేధాల కారణంగా సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేసింది. 130 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ కేవలం 1 సీటు మాత్రమే సాధించింది. ఆ సమయంలో పార్టీ పనైపోయిందని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ ఐదేళ్లు తిరగకుండానే ఎల్జేపీ పార్టీ తన సత్తా ప్రదర్శించింది. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిరాగ్‌ పాశ్వాన్ వరుస ఎన్నికల్లో దుమ్ములేపుతున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ